దేవాదాయశాఖ ఎసి అరసవల్లి సందర్శన

దేవాదాయశాఖ అదనపు

చిత్రపటాన్ని అందిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

దేవాదాయశాఖ అదనపు కమిసనర్‌ టి.చంద్రకుమార్‌ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో నిర్వహించిన స్వామివారి సేవల్లో పాల్గొన్న అనంతరం అనివెట్టి మండపంలో వారికి స్వామివారి శేషవస్త్రాలను కప్పి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️