నడకే దివ్య ఔషధం 

Apr 7,2024 13:38 #srikakulam

స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు 

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదం పాతది అయినా అదే ఇప్పుడు అందరకీ దిక్సూచిగా మిగిలిందని శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ మూత్ర పిండాల వ్యాధి నిపుణురాలు డాక్టర్ బెందాలం గౌతమి అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ మరియు ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ సారధ్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ గౌతమి మాట్లాడుతూ ఈ ఏడాది నా ఆరోగ్యం-నా హక్కు అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లే కీలకమని ప్రతీ ఒక్కరూ శారీరిక శ్రమతో పాటు నడక వ్యాయామం యోగా సమయానికి ఆహారం తీసుకోవటం తగినంత నీరు త్రాగడం వల్ల అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అన్నారు. నిత్య జీవితంలో ప్రతీ ఒక్కరూ జింక్ పుడ్స్ కు బానిసులు అవుతున్నారని ఇది ముమ్మాటికీ ప్రమాదమని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి నడక దివ్య ఔషధం గా పనిచేస్తుందని ఈ దిశగా నడక సంఘాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేయటం ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే ఆహారాన్ని మించిన ఔసదం లేదన్నారు. డాక్టర్ సలహా లేకుండా విచ్చల విడిగా మందులు వాడటం మంచిది కాదని అన్నారు. ముందస్తు అవగాహనతో అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ కో ఆర్డినేటర్ సాశపు జోగి నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సులో అంతర్జాతీయ నడక సంఘం మాజీ గవర్నర్ జి.ఇందిరా ప్రసాద్ మాట్లాడుతూ… సంపూర్ణ ఆరోగ్యానికి నడక సంఘాలు ఇతోధికంగా సేవలు సమాజానికి అందిస్తున్నాయని ప్రతీ ఒక్కరూ నడక సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో నడక సంఘాలు చేస్తున్న కృషి వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతీ ఒక్కరూ ఆహార నియమాలు విధిగా పాటించాలన్నారు. ఈ కార్య క్రమంలో ఆర్ట్స్ కళాశాల ఎన్ సి సి అధికారి డాక్టర్ వై.పోలినాయుడు మహిళా విభాగం ఎన్ సి సి అధికారులు బి. వరలక్ష్మి, పావని స్టార్ వనితా నడక సంఘం అధ్యక్షరాలు జి. లక్ష్మీ స్టార్ వాకర్స్ క్లబ్ కార్యదర్శి బి.దేవీప్రసాద్ నడక సంఘాల ప్రతినిధులు డాక్టర్ జి. నారాయణ రావు, నాగేశ్వర ఈశ్వరరావు, ఎం.మల్లిబాబు, వై మోహన్, జి.ఆనందరావు, జి.వాసు మాస్టర్, పాలకొండ ప్రశాంత్, పి.నాగేశ్వరరావు మహిళా ప్రతినిధులు వాసంతి రామ్ బాయి తదితరులు పాల్గొన్నారు..

➡️