సౌకర్యంగా ఓటు వేయొచ్చు

తశాతం పోలింగ్‌
  • వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు
  • పోలింగ్‌ కేంద్రంలో ర్యాంపులు,
  • వీల్‌ ఛైర్లుఇప్పటికే వద్ధులు, వికలాంగులకు
  • హోం ఓటింగ్‌కు అవకాశం

ప్రజాశక్తి – శ్రీకాకుళం

శతశాతం పోలింగ్‌ సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్నికల సంఘం అందుకు తగ్గ అన్ని మార్గాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే వికలాంగులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలను వికలాంగుల ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతోంది. వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, ఎన్నికల సంఘం గుర్తించిన వ్యాధిగ్రస్తులు సులభతరంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేస్తోంది. వారు పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని, ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్లే వరకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 21,481 మంది వికలాంగులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో తప్పక ఓటు వేసేలా ఎన్నికల అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.ఈ జాబితాలోని వారు ప్రత్యేక సౌకర్యాలు పొందవచ్చుఅంధత్వం, తక్కువ దృష్టి, వినికిడి లోపం, చలన / శారీకర వైకల్యం, మానసిక వైకల్యం / బుద్ధిమాంద్యంమానసిక రుగ్మత, యాసిడ్‌ దాడి బాధితులు, తలసేమియా, హెమోఫిల్ల (రక్తం గడ్డకట్టని స్థితి), మెదడు పక్షవాతం, ఆటిజం, బహుళ వైకల్యం, కుష్టువ్యాధి నయమైనవారుమరుగుజ్జు, దీర్ఘకాలిక నరాల సమస్య, నరాల బలహీనత, కండరాల క్షీణత, నాడీ వ్యవస్థలో సమస్యలున్న వారు.ప్రత్యేక సదుపాయాలు ఇలా…పోలింగ్‌ బూత్‌ వరకు వికలాంగులను తీసుకొచ్చి, వారు ఓటు వేసిన తర్వాత తిరిగి వాహనంలో ఇంటికి చేర్చుతారు. ఈ రవాణా సదుపాయం ఉచితమే.ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ట్రైసైకిల్‌ అందుబాటులో ఉంటుంది. మూగ, చెవిటి ఓటర్లకు సైన్‌ లాంగ్వేజీ ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పిస్తారు.పోలింగ్‌ కేంద్రాల్లోకి సులువుగా రాకపోకలకు ర్యాంపులు నిర్మించారు.అంధులకు సహాయంగా పోలింగ్‌ కేంద్రంలోకి ఒకరిని అనుమతిస్తారు.హోం ఓటింగ్‌ అవకాశంపోలింగ్‌ బూత్‌ వరకూ వచ్చి ఓటు వేసే అవకాశం లేని 85 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు, 40 శాతం వికలాంగత్వం దాటిన వికలాంగులు తమ ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో వికలాంగులు, 85 ఏళ్లు పైబడిన వారు కలిపి 495 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు ఇంటి నుంచే ఓటు వేయనున్నారు.సాక్షం యాప్‌వికలాంగుల సహాయం కోసం ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా సాక్షం యాప్‌ రూపొందించింది. ఓటరుగా నమోదు చేసుకోవడం, మార్పులు, చేర్పులు, పోలింగ్‌ కేంద్రాన్ని తెలుసుకోడం, వీల్‌ చైర్‌, రవాణా సదుపాయాన్ని కోసం అభ్యర్ధన, అంధులకు వాయిస్‌ ద్వారా సహకరించడం, వినికిడి లోపం ఉన్న వారికి టెక్ట్స్‌ టు స్పీచ్‌ థెరపీ తదితర సహాయ సహకారాలను ఈ యాప్‌ ద్వారా వికలాంగులు పొందవచ్చు.మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లువికలాంగుల్లో ఓటు వేసే విధానంపై మరింత అవగాహన కల్పించేందుకు, వారిని పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేందుకు జిల్లాలో రెండు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎచ్చెర్ల మండలంలో భగీరథపురం పోలింగ్‌ స్టేషన్‌, పలాస నియోజకవర్గంలో వజ్రపుకొత్తూరు మండలంలోని పల్లెసారథి పోలింగ్‌ కేంద్రాలను మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. ఆయా కేంద్రాల పరిధిలో ఇక్కడ ఎక్కువ మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ర్యాంపులు, తాగునీరు, వైద్య సదుపాయంతో పాటు ప్రత్యేక మరుగుదొడ్లనూ ఏర్పాటు చేశారు.అన్ని ఏర్పాట్లు చేశాంవికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్‌ కేంద్రాలకు అతి సమీపంలో వాహనాల పార్కింగ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు, ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ఒకరు చొప్పున ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీరును అందుబాటులో ఉంచుతున్నాం. గడిచిన ఎన్నికల్లో 70 శాతం మంది వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి శత శాతం సాధించాలన్నదే లక్ష్యం.- కె.కవిత, ఎడి, వికలాంగుల సంక్షేమశాఖజిల్లాలో నమోదైన వికలాంగ ఓటర్ల వివరాలునియోజకవర్గం ఓటర్ల సంఖ్యఇచ్ఛాపురం 2,775పలాస 2,573టెక్కలి 2,649పాతపట్నం 2,380శ్రీకాకుళం 2,724ఆమదాలవలస 2,255ఎచ్చెర్ల 3,144నరసన్నపేట 2,981మొత్తం 21,481

➡️