కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

ప్రజాశక్తి-ముద్దనూరు సాంఘీక సంక్షేమ బాలుర వసతి గృహంలో కలుషిత ఆహారం తిని ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం స్థానిక సాంఘీక సంక్షేమ వసతి గృహంలో ఉదయం అల్పా హారంలో భాగంగా హాస్టల్లో విద్యార్థులకు ఇడ్లి, సాంబారు ఏర్పాటు చేశారు. 28 మంది విద్యార్థులు అల్పాహారం తిన్నారు. వీరిలో యశ్వంత్‌, బన్నీ, వెంకటేష్‌, సతీష్‌, లక్ష్మి నరసింహులు, సుశాంత్‌, పెంచల్‌ నరసింహులు, నాగేంద్రకు కడుపు నొప్పి, వాం తులై అస్వస్థతకు గురయ్యారు. యశ్వంత్‌, బన్నీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఓ ప్రయివేట్‌ ఆసుపత్రికి తర లించి చికిత్స అందించారు. స్థానిక పిహెచ్‌సి వైద్యులు కరిష్మా, శ్రీకాంత్‌ బాధిత విద్యార్థులకు మందులు ఇచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. జమ్మలమడుగు ఆర్‌డిఒ శ్రీనివాసులు హాస్టల్‌ వద్దకు చేరుకుని వంట గదిని, ఆహారాన్ని, పరిసరాలను పరిశీలించారు. అల్పాహారాన్ని పరిశీలించి బాధిత విద్యార్థులతో, హాస్టల్‌ వార్డెన్‌, కమాటి, వంట మనిషిని ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. అధికారులతో మాట్లాడి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో బాధిత విద్యార్థులను పరా మర్శించారు. ఇడ్లి ఉడకలేదని సాంబారులో వేసిన కంది పప్పు ఉడకలేదని ఇవి తినడం వల్ల అస్వస్థతకు గురైనట్లు బాధిత పిల్లలు ఆర్‌డిఒకు తెలిపారు. ఉద యం అల్పాహారం ఇడ్లి, సాంబారు తిని బడికి వెళ్ళామని అక్కడ కడుపు నొప్పి, వాంతులు అయ్యాయని చెప్పారు. అల్పాహారం, భోజనం, కూరలు రుచికరంగా ఉండవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా ఆర్‌డిఒ శ్రీనివాసులు మాట్లాడుతూ అల్పా హారం, సాంబారు, నీటి శాంపిళ్లు సేకరించి పరీక్షలు జరి పించాలని అధికారులకు సూచించారు. నీటి క్యాన్లతో నీటి సదుపాయం కల్పించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వార్డెన్‌ మనోహర్‌కు ఆదేశించారు. ప్రతి రోజు హాస్టల్‌ తనిఖీ చేయాలని విఆర్‌ఒకు సూచిం చారు. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని, నీరు అందించాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్‌ వెల్ఫేర్‌ డిడి సరస్వతి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు హాస్టల్‌ పరిశీలించి అస్వస్థతకు గల కారణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపిడిఒ చంద్ర మౌలీశ్వర్‌, సిఐ దస్తగిరి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ శివప్రసాద్‌ ఉన్నారు. వైద్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.విద్యార్థులకు మెరుగైన వైద్యమందించాలి- విద్యార్థి సంఘాల డిమాండ్‌ మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ బాలుర వసతి గృహంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి ఇందుకు కారణమైన హాస్టల్‌ వార్డెన్‌, వంట మనిషిని సస్పెండ్‌ చేయాలని డివైఎఫ్‌ఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. హాస్టల్‌లో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సరస్వతికి వినతిపత్రం అందజేసినట్లు డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా పార్లమెంట్‌ అధికార ప్రతినిధి సిద్ధార్థ తెలిపారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు అస్వస్థతకు కారణం వార్డెన్‌ నిర్లక్ష్యమేనని స్పష్టంగా కనబడుతుందన్నారు. వంట మనిషి ప్రసాద్‌ వంట సరిగ్గా చేయడం లేదని విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాడని వార్డెన్‌ మనోహర్‌ దృష్టికి తెచ్చిన పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. హాస్టల్లో వార్డెన్‌ పర్యవేక్షణ లోపం పూర్తిగా కనబడుతుందన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వార్డెన్‌ మనోహర్‌, వంట మనిషి ప్రసాద్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. విద్యార్థులకు అస్వస్థతకు గురవడం బాధాకరమని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం హాస్టళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పెండింగులో ఉన్న మెస్‌ బిల్లులు చెల్లించాలన్నారు. మిస్‌ బిల్లులు, ఇతర వాచ్‌మెన్‌, ట్యూటర్‌ వంటి పోస్టులు భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు మహేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ ముద్దనూరు మండల నాయకులు గణేష్‌, నవీన్‌, గోపాల్‌, రాజమోహన్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు సుమంత్‌, పవన్‌ పాల్గొన్నారు.

➡️