భూముల కబ్జాకే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం

May 8,2024 20:56

ప్రజాశక్తి-బాడంగి: ప్రజల భూములు కబ్జా చేసేందుకే సిఎం జగన్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును తీసుకొచ్చారని టిడిపి బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు ఆరోపించారు. బాడంగి మండలం లోని ముగడ, గజరాయనివలస, గొల్లది, తదితర గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బేబినాయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిన ఎమ్మెల్యేకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. తాను ప్రజలకు ఎల్లవేళలా అందుబా టులో ఉంటానని చెప్పారు. ముగడ గ్రామంలో ఇటీవల పర్యటించిన వైసిపి నాయకులు సరైన అవగాహనతో, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తెంటు రవిబాబు, ఎస్‌టి సెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలవలస గౌరు, బిసి సాధికార సమితి పార్లమెంట్‌ కన్వీనర్‌ కొల్లి అప్పల నాయుడు, ఎంపిటిసి ఎస్‌.భాస్కరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కళాసీల మద్దతు కోరిన రామ్‌నాయనబొబ్బిలి : టిడిపి అభ్యర్థి బేబినాయనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పట్టణ కళాసీలను రామ్‌నాయన కోరారు. పట్టణ కళాసీ సంఘం నాయకులను బుధవారం కలిసి, తన సోదరుడికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. టిడిపిలో చేరికలుమున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌ గునాన విజయలక్ష్మి వైసిపిని వీడి, బుధవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన సమక్షంలో టిడిపిలో చేరారు. 27వ వార్డుకు చెందిన వాలంటీర్లు కె.హరికృష్ణ, వై.అలేఖ్య.. మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు సమక్షంలో టిడిపిలో చేరారు. కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్‌ పువ్వల శ్రీనివాసరావు పాల్గొన్నారు.బేబినాయనను గెలిపించాలని జనసేన ర్యాలీఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన, ఎంపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించాలని కోరుతూ బుధ వారం పట్టణంలో జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జనసేన కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి మాట్లాడుతూ వైసిపి అరాచక పాలనకు బుద్ది చెప్పేందుకు టిడిపి, జనసేన, బిజెపి కూటమిని గెలిపించాలన్నారు. కూటమితోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సింగరాయి, జగ్గయ్యపేటలో టిడిపి ప్రచారంవేపాడ: మండలంలోని సింగరాయి, జగ్గయ్యపేటలో నియోజకవర్గ టిడిపి మహిళా అధ్యక్షులు గుమ్మడి భారతి ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి, ఎమ్‌పి అభ్యర్థి శ్రీభరత్‌లను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర ఎస్‌టి సెల్‌ ఉపాధ్యక్షులు దాసరి లక్ష్మి, ఎంపిటిసి గొంప తులసీ, కోళ్ల లలిత కుమారి చెల్లి ఉషశ్రీ, గేదెల అరుణ, రాధిక నాయుడు తదితరులు పాల్గొన్నారు.టిడిపిలో 300 కుటుంబాలు చేరికశృంగవరపుకోట: టిడిపి గెలుపు ఖాయమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి సుధారాణి అన్నారు. పట్టణంలోని 17వ వార్డు మెంబర్‌ కోసూరి భారతి ఆధ్వర్యంలో బుధవారం సుమారు 300 కుటుంబాలు వైసిపి నుంచి టిడిపిలో చేరాయి. వారికి సుధారాణి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా సుధారాణి మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌కి పథకాలు నచ్చి చాలా మంది టిడిపిలో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సండి సోమేశ్వరావు, ఎస్‌కోట మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ సంతోషికుమారి, ఎంపిటిసి వాకాడ సింహాచలం, మోపాడ గౌరినాయుడు, మజ్జి దేవి, మామిడి కృష్ణవేణి, బొడ్డేటి సూరి అప్పారావు, దుల్ల రమణ, మంగరాజు, సిమ్మా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️