వృద్ధురాలు దారుణ హత్య

ప్రజాశక్తి- కొత్తపట్నం : గుర్తుతెలియని వ్యక్తులు ఓవృద్ధు రాలును దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని రెడ్డిపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ బి. సాంబశివరావు కథనం ప్రకారం… రెడ్డిపాలెంకు చెందిన గుడిపల్లి నాగేశ్వరమ్మ (75) అనే వృద్ధురాలు కల్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. రోజులాగే కల్లుగీత కార్మికుడు ఉదయాన్నే నాగేశ్వరమ్మ ఇంటికి కల్లు తీసుకొచ్చాడు. ఆమె మంచంపై పడుకొని ఉంది. ఎంత పిలిచినా పలుకలేదు. అనుమానం వచ్చి కల్లుగీత కార్మికుడు నాగేశ్వరమ్మ దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. ఆమె చనిపోయి ఉంటాన్ని గుర్తించి కుమారుడికి ప్రకాష్‌ రావుకు సమాచారం అందించారు, నాగేశ్వరరమ్మ కుమారుడు ఇంటికి వద్దకు వచ్చి పరిశీలించారు. ఇంటిలోని వస్తువులన్ని చిందరవందరగా పడిఉన్నాయి. నాగేశ్వరమ్మ మెడ, ముక్కపై గాయాలు ఉంటాన్ని గుర్తించాడు. నాగేశ్వరమ్మ హత్యకు గురైనట్లు బావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని వివరాలను సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ ను రంగంలో దించి వివరాలు సేకరించారు. అర్ధరాత్రిరెండు గంటల సమయంలో నాగేశ్వరమ్మ హత్యకు గురైనట్లు పోలీసులు బావిస్తున్నారు. కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాంబశివరావు తెలియజేశారు. డిఎస్‌పి కిషోర్‌ కుమార్‌, క్రైమ్‌ అడిషనల్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ రావు, సిఐ జగదీష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

➡️