కార్మికులపై ఒత్తిడి దారుణం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఎండ తీవ్రతకు పని చేయాలంటే మున్సిపల్‌ డ్రై వర్లు విలవిలలాడుతున్నారని, అధికారులు మాత్రం పని చేయాల్సిందే అంటూ ఒత్తిడి చేయడం దారుణమని మున్సిపల్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు సుంకర రవి, జిల్లా కమిటీ సభ్యులు కంచుపాటి తిరుపాల్‌ అన్నారు. శని వారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎంతగా ఉన్నా, పారిశుధ్య కార్మికులు ఎండ దెబ్బకు అనారోగ్యం పాలవుతున్నా, డ్రైవర్లు, లోడర్లు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నా టన్నులు, టన్నులు చెత్త తోలాల్సిందే అంటూ కడప నగరపాలక సంస్థ అధికారులు క్లాప్‌ ఆటో, లోడర్స్‌, డ్రైవర్స్‌ ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నగరపాలక అధికారులు ఒక గంట కూడా అనుమతి ఇవ్వకుండా మండు టెండలో సైతం పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వా విపత్తుల శాఖ వారు ఎండ తీవ్రత ఎక్కువ ఉందనే ప్రజలు ఎవరు కూడా అత్య వసరమైతే తప్ప బయట తిరగ వద్దు అని చెబుతుంటే ఈ నగర పాలకసంస్థ అధికారులు మాత్రం మధ్యాహ్నం మూడు గంటలకు రావాల్సిందే.. పని చేయాల్సిందే ఒక నియంత పరి పాలన చేస్తున్నారని చెప్పారు. కమిషనర్‌ పేరు చెప్పి అధి కారులు కొంతమంది కార్మి కులను భయభ్రాంతులకు గురి సచేస్తున్నారని పేర్కొన్నారు. ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒంటి పూట పనిని కల్పించాలని కోరారు. లేని పక్షాన విధులు బహిష్కరించి మా నిరసన తెలియజేస్తుమని హెచ్చరించారు. సమావేశంలో కమిటీ సభ్యులు నాగరాజు పాల్గొన్నారు.

➡️