అరకు సిపిఎం అభ్యర్థిని గెలిపించాలంటూ… విస్తృత ప్రచారం

Apr 27,2024 11:07 #Araku, #campaign, #CPM candidate

అరకు (విశాఖ) : అరకువేలి మండలం పద్మాపురం పంచాయితీలో ఇండియా కూటమి బలపరిచిన అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పి.అప్పలనరసకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆదివాసీ ప్రాంతంలో నీళ్లు, నిధులు, నియామకాలు కావాలంటే సిపిఎం గెలువాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పి.బాలదేవ్‌, జన్ని భగత్‌ రామ్‌, ధర్మ, హరి, జయ్యో, తదితరులు పాల్గొన్నారు.

➡️