అల్లం…వెలొల్లి!మసాలా గరంగరంధరలు పెంచేసిన హోటళ్లు

అల్లం...వెలొల్లి!మసాలా గరంగరంధరలు పెంచేసిన హోటళ్లు

అల్లం…వెలొల్లి!మసాలా గరంగరంధరలు పెంచేసిన హోటళ్లుప్రజాశక్తి-శ్రీకాళహస్తి మొన్న టమోటాలు.. నిన్న ఉల్లిపాయులు.. నేడు వెల్లుల్లి వంతొచ్చింది. ధరల్లో టమాటాలు, ఉల్లిపాయాలకు తానేమీ తీసిపోనంటూ కొండెక్కి కూర్చుంది. అది కూడా దిగిరాలేనంత ఎత్తుకుపోయి స్థిరపడింది. మరీ దానంత కాకున్నా వెల్లుల్లి మిత్రుడు అల్లం ఓ మాదిరిగా ధర పెరిగి సామాన్యులకు చుక్కలు చూపెడుతోంది. మొదలే మన జనాలు అధిక శాతం నాన్‌వెజ్‌ ప్రియులు. ముక్కలేందే ముద్ద దిగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అల్లం..వెల్లుల్లి ధరలు కొండెక్కి కూర్చోవడంతో కూరల్లో అవి కానరాని పరిస్థితి నెలకొంటోంది. రూ.500కు చేరువలో ఎల్లిగడ్డసరిగ్గా ఐదు నెలల కిందట మార్కెట్లో కిలో వెల్లుల్లి ధర కేవలం రూ.250 మాత్రమే. అంతకుముందు కిలో 100 పలికిన రోజులూ లేకపోలేదు. కట్‌ చేస్తే ఇప్పుడు దాని ధర రూ.400కు చేరుకుంది. మరో నెల రోజుల్లో రూ.500కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి. హోల్‌సేల్‌ మార్కెట్లో రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నారు. గడ్డ బాగుంటే వ్యాపారులు రూ.400కు మించి ధర చెబుతుండటం గమనార్హం. వంటల్లో నిత్యం వాడే ఉల్లి, వెల్లుల్లి ధరలు పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. వర్షాలకు వెల్లుల్లి పంట నీట మునగడం, మార్కెట్లో నిల్వలు తగ్గుతుండడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట మార్కెట్‌కు చేరడానికి బాగా ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్రలోని నాసిక్‌, పూణే ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఉల్లి, వెల్లుల్లి దిగుబడి భారీగా పడిపోయింది. దీంతో వ్యాపారులు ప్రస్తుతం గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ల నుంచి వెల్లుల్లి దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్నారు. మరో మూడు, నాలుగు నెలల దాకా ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్న పరిస్థితి. అల్లం అధికంగా ఎగుమతి చేసే కేరళ రాష్ట్రంలో కూడా తుపాన్‌ల కారణంగా ఆ పంట దెబ్బతింది. ఎగమతులు కూడా తగ్గిపోయాయి. దీంతో అల్లం వెల్లుల్లి ధర కూడా రెండు రెట్లు పెరిగింది. మూడు నెలల కిందట కిలో రూ.70 గా ఉన్న అల్లం ప్రస్తుతం రూ.140కు చేరడం గమనార్హం. ధరలు పెంచేసిన హోటళ్లుప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర చికెన్‌ కంటే రెండింతలు ఉంది. నిత్యావసర సరకుల నిమిత్తం దుకాణానికి వెళ్లిన సామాన్యులు ఆకాశాన్నంటిన వెల్లుల్లిని చూసి కొనేందుకు జంకుతున్నారు. ఇది వరకు కిలో చొప్పున కొనుగోలు చేసిన గహిణులు ఇప్పుడు పావు కిలో లేదంటే విడిగా రూ.20 లేదా రూ.30కి తెచ్చుకుని వాడుకుంటున్నారు. హోటళ్లలో అయితే ఏకంగా ధరలు పెంచేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని సాధారణ హోటళ్లలో ప్లేటు భోజనం రూ.60 నుంచి రూ.70కే దొరికేది. అది కాస్త ఇప్పుడు రూ.80 నుంచి రూ.90కి చేరింది. నాన్‌ వెజ్‌ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. రూ.100కు లభించే బిర్యానీ రూ.160 నుంచి రూ.180కు చేరుకుంది. రెస్టారెంట్లలో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. బిర్యానీ ధర ఏకంగా రూ.250కు చేరుకుంది. దీంతో హోటల్‌ భోజనం చేయాలనుకునే సామాన్యులు ఆ ఆలోచన మానుకునే పరిస్థితి ఏర్పడింది. టమోటాతోనే సరి : ఉషా, గృహిణితెల్ల గడ్డలు, అల్లం గడ్డలు కొనలేకున్నాం. మసాలా కోసం ఎక్కువశాతం టమోటాలు, తక్కువగా అల్లం వాడుతున్నాం. తెల్లగడ్డలను మరిచిపోయి రెండు నెలలు కావస్తోంది. మార్కెట్‌ వైపు చూడాలంటేనే భయం వేస్తోంది. తెల్లగడ్డలే కాదు కూరగాయలు కొందామన్నా భయం వేస్తోంది. ఉప్పులు, పప్పులు, సోపులు, షాంపులు, కూరగాయలు ధరలు గతం కంటే బాగా పెరిగిపోయాయి. మా ఆదాయం మాత్రం ఇంకా అక్కడే ఉంది. మేమొస్తే అన్నీ తగ్గించేస్తామన్న పాలకులు ఏం చేస్తున్నారో మరి. ప్రభుత్వం స్పందించి ధరలను అందుబాటులోకి తేవాలి. ఆశా వర్కర్ల నిర్బంధం అన్యాయంప్రజాశక్తి – గూడూరు టౌన్‌ ఛలో విజయవాడ ఆశా వర్కర్లు కార్యక్రమానికి వెళ్లేందుకు బుధవారం సాయంత్రం గూడూరు రైల్వే స్టేషన్‌ కు చేరుకొన్న వెంకటగిరి, సూళ్లూరుపేట కి చెందిన ఆశా వర్కర్లును బుధవారం సాయంత్రం గూడూరు పోలీసులు గుర్తించి అరెస్టు చేసి సమీపంలో వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న గూడూరు సి.పి.ఎం., సి.ఐ.టి.యు నాయకులు వెంటనే పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్లి పోరాటాలపై నిర్బంధం అన్యాయమని, మహిళలను అర్ధరాత్రి వేళ అరెస్టు చేసి కుటుంబాల్లో టెన్షన్‌ వాతావరణాన్ని సృష్టించరాదని సూచించారు.

➡️