జాతీయస్థాయి క్రీడలకు ‘తిరుపతి విద్యార్థులు

జాతీయస్థాయి క్రీడలకు 'తిరుపతి విద్యార్థులు

జాతీయస్థాయి క్రీడలకు ‘తిరుపతి విద్యార్థులు’ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: జాతీయస్థాయిలో జరగనున్న ఫెన్సింగ్‌ క్రీడల్లో తిరుపతి విద్యార్థులు ఎంపికయ్యారు. చిత్తూరులో ఈనెల 8, 9, 10వ తేదీలో 10వ సబ్‌ జూనియర్‌ అండర్‌- 14 అండర్‌-17 ఇంటర్‌ జిల్లా పెన్సిల్‌ ఛాంపియన్షిప్‌ పోటీలు జరిగాయి. పోటీలో అండర్‌-14 విభాగంలో ఇ.రమ్యశ్రీ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. అండర్‌- 17 విభాగంలో తిరుపతి ఏటీఎం కళాశాలలో ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్న జి.భవిష్య సిల్వర్‌ మెడల్‌ సాధించారు. మెడల్‌ సాధించిన విద్యార్థులకు గుజరాత్‌ రాష్ట్రంలో డిసెంబర్‌ 19 నుంచి 22వ తేదీ జరిగే జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ పోటీలో వీరు పాల్గొననున్నారు. మెడల్‌ సాధించిన విద్యార్థులకు టీటీడీ స్కూల్స్‌ టేక్‌ వండర్‌, ఫెన్సింగ్‌ కోచ్‌ గోపి నాయుడు అభినందించారు.

➡️