నారావారిపల్లెలో సంక్రాంతి శోభ..

Jan 14,2024 21:39
నారావారిపల్లెలో సంక్రాంతి శోభ..

చంద్రబాబు, లోకేష్‌లకు ఘన స్వాగతం…నాని ఆరోగ్యం పరిస్థితి పై ఆరా తీసిన బాబుప్రభుత్వ జీవోలు దగ్ధం సాంస్కతిక కార్యక్రమాలతో సందడిప్రజాశక్తి- రామచంద్రపురం:తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, నారావారిపల్లెలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి పర్వదినాన్ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన, నారా లోకేష్‌ ఇద్దరు ఏ.రంగంపేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి హరికష్ణ, బాలకష్ణ సతీమణి వసుంధర, నారా దేవాన్ష్‌ రెండు రోజుల క్రితమే నారావారిపల్లెకు చేరుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు ఘన స్వాగతం లభించింది. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి, తనయుడు పులివర్తి వినీల్‌ పుష్పగుచ్చం అందజేసి దుశ్యాలవతో సత్కారించారు. దొంగ ఓట్లు ఏరివేతకు ఆమరణ నిరహార దీక్ష చేస్తుండగా జరిగిన ఘటనలో పెట్రోల్‌ పైన పడి తీవ్రంగా గాయపడిన పులివర్తి నాని ఆరోగ్య పరిస్థితిని నారా లోకేష్‌ అడిగి తెలుసుకున్నారు. సుధారెడ్డి, వినీల్‌లకు ధైర్యం చెప్పి, గుండె నిబ్బరంతో పోరాడాలని చెప్పారు. ప్రభుత్వ జీవోలు దగ్దం.. నారావారిపల్లెలో భోగి మంటల్లో ప్రభుత్వ జీవోలు దగ్ధం చేశారు. నందమూరి వసుంధర, నందమూరి రామకష్ణ, పులివర్తి సుధారెడ్డిలు, చంద్రబాబు సోదరి హైమావతిలు జీవో నెం1, ఎస్మా, ఇన్నరింగ్‌ రోడ్డు, లికర్క్‌, శాండ్‌, స్కిల్‌ డెవలప్మెంట్‌ ఎఫ్‌ఐఆర్‌ కాఫీలు తగులబెట్టి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాంస్కతిక కార్యక్రమాలతో సందడి..నారావారిపల్లెలో సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హరిదాసు కీర్తనలు, ముగ్గుల పోటీలు, ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొంది. ఆటపాటల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు ప్రధానం చేశారు. చంద్రబాబు నాయుడు రాకతో నారావారిపల్లి గ్రామంలో సందడి చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌ కష్ణారెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎసివి నాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మన్‌ శ్రీధర్‌ హేమాంబరధరరావు స్థానిక నాయకులు కలిసి పుష్పగు చ్చాలు అందించి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నర్సింగాపురం నుంచి నారావారిపల్లి వరకు రహదారికి ఇరుపక్కల తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాబుకు స్వాగతం పలుకుతూ భారీ కటౌట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

➡️