వైసిపి బరితెగింపుగోడౌన్‌లో రూ.5 కోట్ల విలువైన నగదు..?పార్టీ జెండాలు, టోపీలు, గొడుగులుఎన్నికల తాయిలాల లారీని అడ్డుకున్న టిడిపి

వైసిపి బరితెగింపుగోడౌన్‌లో రూ.5 కోట్ల విలువైన నగదు..?పార్టీ జెండాలు, టోపీలు, గొడుగులుఎన్నికల తాయిలాల లారీని అడ్డుకున్న టిడిపి

వైసిపి బరితెగింపుగోడౌన్‌లో రూ.5 కోట్ల విలువైన నగదు..?పార్టీ జెండాలు, టోపీలు, గొడుగులుఎన్నికల తాయిలాల లారీని అడ్డుకున్న టిడిపిప్రజాశక్తి – రామకుప్పం ‘ట్యాంకర్‌లో నీళ్లు తెచ్చి సెట్టింగ్‌లా గేటు పెట్టి జగన్‌ బటన్‌ నొక్కి వెళ్లిపోయారని, బటన్‌ నొక్కినా పూర్తిస్థాయిలో నీళ్లు రాలేదని, తెచ్చి పోసిన నీళ్లు తెల్లారేసరికి ఇంకిపోయాయి’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఉత్తుత్తి బటన్‌ నొక్కి నీళ్లు వదిలారని, కనీసం మట్టి పెళ్లలు కూడా తడవలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కుప్పంకు హంద్రీనీవా నీళ్లు తెస్తానని ఎన్నికల హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం రాజుపేట వద్ద హంద్రీనీవా కాల్వను టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పరిశీలించారు. ఫిబ్రవరి 26వ తేదీన ఇదే ప్రాంతంలో సిఎం జగన్‌ బటన్‌ నొక్కి కుప్పానికి హంద్రీనీవా జలాలు విడుదల చేసిన సంగతి విదితమే. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సెట్టింగ్‌ల సిఎం వస్తాడని డైరెక్టర్లు, నిర్మాతలు కూడా అనుకోలేదన్నారు. కుప్పం భూమిపై నడిస్తే అరిగిపోతాడని రెండు హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేసి తిరిగాడని, ఆర్డీసీ బస్సులు, స్కూలు బస్సులన్నీ పెట్టి జనాన్ని తరలించారన్నారు. ఇలాంటి ఘనకార్యాలు చేసిన నువ్వు నన్ను ఓడిస్తావా అని ప్రశ్నించారు. ప్రజలు ఛీ కొడతారన్న ఇంగితజ్ఞానం లేకుండా నీళ్లు తెచ్చానంటూ డ్రామాలాడారన్నారు. ఐదేళ్లుగా నడిపిన వైసిపి డ్రామా కంపెనీని శాశ్వతంగా మూసేయబోతున్నామన్నారు. రోడ్డు మార్గంలో పర్యటనకు మళ్లీ కుప్పంకు వస్తానని జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారని, హెలికాఫ్టర్లలో వస్తే చెట్లు నరికించేశాడని, రోడ్లు మీద వస్తే ఇళ్లు పీకేస్తాడేమో అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రికార్డులు తారుమారు చేస్తున్నారని, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్టిఫికెట్లపై జగన్‌ ఫొటో పెట్టుకున్నారన్నారు. అధికారంలోకి వస్తే రెస్కోను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆనందరెడ్డి, నేతలు మునస్వామి, నరసింహులు, ఆంజనేయరెడ్డి, చిన్నకృష్ణ, చలపతి, రామ్మూర్తి, నందారెడ్డి పాల్గొన్నారు. చలమయ్య కుటుంబానికి ఆర్థిక సాయం కుప్పం మహిళల ముఖాముఖి సమావేశాన్ని ముగించుకుని మంగళవారం తిరుగు ప్రయాణమై వెళుతుండగా టిడిపి కార్యకర్తలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహాన్ని కారు ఢకొీంది. ఈ ప్రమాదంలో రామకుప్పం మండలం ఆనిగానూరు గ్రామానికి చెందిన చలమయ్య (32), నాగభూషణం (38) గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం పిఇఎస్‌ ఆస్పత్రికి తరలించారు. చలమయ్య చికిత్స పొందుతూ మృతిచెందాడు. గాయపడిన నాగభూషణంను చంద్రబాబునాయుడు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. చలమయ్య కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

➡️