ఎస్వీయూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా చంద్రయ్య

ఎస్వీయూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా చంద్రయ్య

ఎస్వీయూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా చంద్రయ్య ప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నూతన ఇన్చార్జి రిజిస్ట్రార్‌ గా బి. చంద్రయ్య నియమితులైనట్లు పరిపాలన భవనం ఒక ప్రకటనలో తెలిపింది. యూనివర్సిటీలోని యూజీసీ విభాగంలో జాయింట్‌ రిజిస్ట్రార్‌ గా ఎంతో కాలంగా పరిపాలన అనుభవం కలిగిన బి.చంద్రయ్య కు వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.శ్రీకాంత్‌ రెడ్డి ఇంచార్జ్‌ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఇటీవల అనివార్య కారణాలవల్ల ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న భౌతిక శాస్త్ర విభాగపు ఆచార్యులు ఓఎండి హుస్సేన్‌ రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. దీంతో గత పది రోజులుగా వర్సిటీ పరిపాలన భవనంలో ఎటువంటి ఆర్థికపరమైన కార్యకలాపాలు, పరిపాలనా పరమైన కార్యకలాపాలు జరగకపోవడంతో పరిపాలన స్తంభించిన విషయం విదితమే. యుజిసి విభాగంలో జాయింట్‌ రిజిస్ట్రార్‌ బి.చంద్రయ్యకు ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా పదోన్నతి లభించడం పట్ల బోధన, బోధననేతర ఉద్యోగుల ప్రెసిడెంట్‌ పికె సుబ్రహ్మణ్యం, సెక్రటరీ సుబ్రహ్మణ్యం, జాయింట్‌ సెక్రెటరీ చంద్రశేఖర్‌, హాస్టల్‌ టెక్నికల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మనోజ్‌ కుమార్‌ సింగ్‌, మాజీ ప్రెసిడెంట్‌ నాగరాజు, మాజీ సెక్రటరీ రవిచంద్ర, ఎన్‌ఎమ్‌ఆర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జగదీష్‌, రూస సీఈవో వంశీకష్ణ, అకాడమీక్‌ కన్సల్టెంట్లు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

➡️