పాఠ్యపుస్తకాలు మినహా ఇతర పుస్తకాలు విక్రయించే ప్రైవేట్‌ స్కూళ్ల పై చర్యలు : జిల్లా విద్యా శాఖ అధికారి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలోని ప్రైవేట్‌ స్కూళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలు మినహా ఇతర పుస్తకాలు విక్రయిస్తే ఆయా పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్‌. ప్రేమ్‌ కుమార్‌ హెచ్చరించారు. ప్రభుత్వానికి 5 శాతం రుసుము చెల్లించి నిర్దేశించిన విక్రయశాలల్లో కొనుగోలు చేసిన పుస్తకాలను మినహా మరే ఇతర పుస్తకాలను కొనాలంటూ … విద్యార్థులకు సిఫారసు చేయకూడదని విద్యాశాఖాధికారి స్పష్టం చేశారు.

➡️