షర్మిల బస్సు యాత్రను జయప్రదం చేయండి

షర్మిల బస్సు యాత్రను జయప్రదం చేయండి

షర్మిల బస్సు యాత్రను జయప్రదం చేయండిప్రజాశక్తి-శ్రీకాళహస్తి మతతత్వ బిజెపి పాలనలో మునిగిపోతున్న భారత నావను కాపాడాలంటే మార్పు అనివార్యమనీ, అది కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ఇండియా కూటమి శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పోతుగుంట రాజేష్‌ నాయుడు అన్నారు. స్థానిక గోపాలవరంలోని పోతుగుంట నివాసంలో శనివారం ఇండియా కూటమి మిత్రపక్షాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 14వ తేదీన శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద నిర్వహించనున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ సభను జయప్రదం చేయాలని మీడియా ముఖంగా ఆయన పిలుపునిచ్చారు. తన తండ్రి పోతుగుంట గురవయ్య నాయుడు టిడిపికి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. మచ్చలేని నాయకుడిగా, అజాతశత్రువుగా కీర్తి గడించిన తన తండ్రికి టిడిపి అధిష్టానం ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వడంలో విస్మరించిందని వాపోయారు. తండ్రి ఆశయాల సాధనల కోసం వైద్య వత్తిని, వ్యాపారాలను వదులుకొని రాజకీయాల్లోకి అడుగు పెట్టాననీ, తనకూ టిడిపి అధిష్టానం మొండి చెయ్యి చూపిందని విచారం వ్యక్తం చేశారు. విద్యావంతుడిగా, యువకుడిగా శ్రీకాళహస్తి రాజకీయాల్లో, అభివద్ధిలో తాను మార్పు కోరుకుంటున్నాననీ, ఆ మార్పు కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని నమ్మి హస్తం గూటికి చేరినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం తనకు ఆపన్నహస్తం అందించి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించినందుకు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, వైఎస్‌ షర్మిల, చింతా మోహన్‌ కు ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివద్ధి పథంలో నడిపి శ్రీకాళహస్తి రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని లిఖించుకుంటానంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో దేశ, రాష్ట్ర ప్రజలు హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌ను గెలిపించాలనీ, మార్పును స్వాగతించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు గంటా శ్రీనివాసులు, చిరంజీవి, కూలి రవి, సీపీఎం నాయకులు గంధం మణి, పెనగడం గురవయ్య, సీపీఐ నాయకులు జనమాల గురవయ్య, మించల శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పుత్తూరులో… ఈనెల 14న సాయంత్రం పుత్తూరులో షర్మిలమ్మ బస్సు యాత్ర ఉంటుందని, జయప్రదం చేయాలని మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు కేశవులు కోరారు. ఎంఎల్‌ఎ అభ్యర్థి రాకేష్‌రెడ్డి గృహంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ పుత్తూరులో సాయంత్రం ఆరు గంటలకు కార్వేటినగరం రోడ్డులో షర్మిలమ్మ బస్సు యాత్ర ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లోహితరాజు, గోపిరాయల్‌, భాగ్యరాజ్‌, సుధాకర్‌ పాల్గొన్నారు. స్థానికున్ని…ఆదరించండి : ఆవుల గోపి ప్రజాశక్తి -శాంతిపురం ‘నేను స్థానికుడ్ని… ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాడిని… నన్ను ఆదరించండి’ అని కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి ప్రజలను అభ్యర్థించారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన కుప్పంలో పాతపేట కొత్తపేట, మసీదు ప్రాంతాల్లో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నుకుంటే ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి కష్టసుఖాల్లో తమ వెంట నడుస్తూ కుప్పం ప్రాంత అభివద్ధికి తన వంతు కషి చేస్తానని అన్నారు. అనంతరం గుడిపల్లి మండలం బెగ్గలపల్లి, బండ కొత్తూరు, గోకర పల్లె లో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కుప్పం పార్టీ అధ్యక్షుడు మునుస్వామి, చంద్రప్ప పాల్గొన్నారు.

➡️