పోలింగ్‌ విధానంపై అవగాన మాక్‌ పోలింగ్‌

పోలింగ్‌ విధానంపై అవగాన మాక్‌ పోలింగ్‌ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌ : అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు సెలెక్ట్‌ చేసిన పోలింగ్‌ బూతులకు సంబంధించి మాక్‌ పోల్‌ నిర్వహించామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటన్నింగ్‌ అధికారి పి శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక పి వి కె యన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో రాజకీయ పార్టీల ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం 25 చిత్తూరు (ఎస్‌ సి) పార్లమెంట్‌, అసెంబ్లీ సెగ్మెంట్‌ కు సంబంధించి రిటన్నింగ్‌ అధికారి అధ్యక్షతన మాక్‌ పోల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ వి యం ల పై ఉన్న అపోహలు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా ?’ అని మాక్‌ పోల్‌ నిర్వహించారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 226 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు సెలెక్ట్‌ చేసిన పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి మాక్‌ పోల్‌ నిర్వహించారు.

➡️