పోలింగ్‌ కేంద్రాన్ని బిఎల్‌ఏలు పరిశీలించాలిప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌ : ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని మళ్లీ ఒక్కసారి బి యల్‌ ఓ లు పరిశీలించాలని జాయింట్‌ కలెక్టర్‌, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటన్నింగ్‌ అధికారి పి శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక పి వి కె యన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నగర పాలక సంస్థ కమిషనర్‌ ఏఆర్‌ఓ డాక్టర్‌ జెఅరుణ తో కలసి పోలింగ్‌ రోజు బి యల్‌ఓ లు నిర్వహించాల్సిన విధులపై బి యల్‌ ఓ లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పోలింగ్‌ రోజు బి యల్‌ఓ లు చాలా కీలకమని, బి యల్‌ ఓ లు బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. బి యల్‌ ఓ లు మళ్లీ ఒక్కసారి మీ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించాలని, పోలింగ్‌ రోజు నాటికి పోలింగ్‌ కేంద్రం లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌, ఇంటర్నెట్‌ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఇప్పటికే ఓటర్లకు ఓటర్‌ స్లిప్పులు పంపిణీ పూర్తి చేశారని, ఓటర్‌ స్లిపులు మాకు చేరలేదని ఎవ్వరైనా మా దష్టి తెస్తే సంబందితా బి యల్‌ ఓ పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.అసెంబ్లీ నియోజకవర్గం కు సంబంధించి ఓటర్‌ జాబితా ప్రకారంగా మరణించిన వారివి,డబ్భుల్‌ ఎంట్రీలకు సంబంధించి పురుషులు, స్త్రీ లు,థర్డ్‌ జండర్స్‌ జాబితా తయారు చేయాలన్నారు.

➡️