ఏనుగుల స్వైర విహారంరెండున్నర ఎకరాల మామిడి పంట నష్టం

ఏనుగుల స్వైర విహారంరెండున్నర ఎకరాల మామిడి పంట నష్టం

ఏనుగుల స్వైర విహారంరెండున్నర ఎకరాల మామిడి పంట నష్టంప్రజాశక్తి- పెద్దపంజాణి: మండలంలోని పెద్దకాప్పల్లి, రాయల్‌పేట నాగిరెడ్డిపల్లి మొదలగు పంచాయతీలు సమీప అటవీ ప్రాంతాల గ్రామాలకు అవడంతో రైతులు సాగు చేస్తున్న పంటలపై ఏనుగులు స్వైర విహారం చేస్తూ రైతుల కష్టాన్ని బుగ్గిపాలు చేస్తున్నాయి. మండలంలోని పెదకాపల్లి పంచాయతీ ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టీ.సుబ్రహ్మణ్యం తన రెండున్నర ఎకరా భూమిలో మామిడి పంట సాగుచేసి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం పైన కుటుంబ జీవనం సాగిస్తూ ఉండేవాడు. పంట దిగుబడి బాగా ఉందని సంతోషపడుతున్న రైతుకు శనివారం రాత్రి ఏనుగులు గుంపు అతని మామిడి తోట పైకి వచ్చి పంట ధ్వంసం చేశాయని రైతు కన్నీటిపర్వంతమయ్యారు. ఆ వద్ధ దంపతులు రాలిన కాయలు ఏరుకుంటూ వారి బాధను వ్యక్తపరిచారు. సంబంధిత ఫారెస్ట్‌ అధికారులు పంట ప్రాణనష్టం జరిగినప్పుడు హడావుడి తప్ప తర్వాత తీసుకున్న చర్యలు శూన్యమని సమీప గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల్లో నుంచి గ్రామ పరిసరాల్లోకి పంట పొలాల్లోకి ఏనుగులు రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సమీప రైతులు కోరుతున్నారు.

➡️