పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ

శిక్షణలో పాల్గొన్న సిబ్బంది, పక్క చిత్రంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి ఎల్‌.శివ శంకర్‌ , నియోజకవర్గ ఆర్‌ఒ 

 పల్నాడు:  త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్‌ సిబ్బంది ఉదాసీనతను వదిలి ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్‌ లోతేటి అన్నారు. శనివారం స్థానిక నరసరావుపేట లోని భువనచంద్ర టౌన్‌ హాల్లో నరసరావుపేట నియోజకవర్గ ఎన్నికల సిబ్బంది పిఓలు, ఏపీవోలు, ఓపిఓలు మరియు మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్‌ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఉన్న కొన్ని సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, సాయుధ బలగాలను కూడా ఉంచ డం జరిగిందన్నారు. పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌ స్టేషన్లలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు ముందస్తుగా ఎవరికి తెలపాలి అనే విషయమై అవగాహన కలిగి ఉండాలన్నారు.

 

ఈవీఎంలలో సమ స్యలు ఉన్న ట్లయితే సంబంధిత సెక్టోరల్‌ ఆఫీసర్లకు తెలియజేయాలని అన్నారు. అదేవిధంగా లా అండ్‌ ఆర్డర్‌ విషయమై ఉదాసీనతను వదిలి పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న పోలీసు సిబ్బందికి,వారిపైన అడిషనల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీంలు ఉంటాయని అన్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఎన్ని కలు నిర్వహించాలన్నారు. పోలింగ్‌ ఏజెంట్లు భయ భ్రాం తులను చేయడం వారిని తీసుకొనిపోవడం వంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పోలింగ్‌ సిబ్బంది అప్రమత్త వ్యవహరించి తదనగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి పి.సరోజ పోలింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️