అకాల వర్షం.. రైతులకు తీవ్ర నష్టం

ప్రజాశక్తి-నిమ్మనపల్లె అకాల వర్షం కారణంగా గాలివాన, వడగళ్ల బీభత్సంతో టమోటా, మామిడి పంట రైతు లకు తీవ్ర నష్టం వాటిల్లింది. సోమవారం రాత్రి వడగళ్లతో కూడిన అకాల వర్షం కురవడంతో గత మూడు నెలల నుంచి ఎండ వేడిమితో అల్లా డుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగినా టమాటా, మామిడి పంట రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మండ లంలోని వెంగం వారిపల్లె పంచాయతీలో ఉద్యానవన పంటలను రైతులు అధికంగా పండిస్తూ వస్తున్నారు. సోమవారం రాత్రి గాలివాన బీభత్సం, వడగండ్ల వర్షంతో సఖిబండవారి పల్లెకు, జంగం వారిపల్లెకు చెందిన టమోటా రైతులు గంగాధర, గఫూర్‌ సాబ్‌, జి.శ్రీని వాసులు, శివశంకర్‌ రెడ్డి, నారాయణరెడ్డి, సుధాకర్‌ రెడ్డిలకు చెందిన కోత దశలోని టమోటా పంట దెబ్బతిని రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మరోవైపు ఈసారి మామిడి దిగుబడి అంతంతమాత్రంగానే ఉన్నా, గాలివాన బీభత్సం కారణంతో మామిడి కాయలు కూడా నేలరాలాయని రైతులు ఆవేదన చెం దారు.సచివాలయ ఉద్యానవన సహాయకులు జయ కష్ణవేణికి రైతులు సమాచారం అందించడంతో వారు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి సుమారు పది ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. పంట నష్ట వివరాలను ఉన్నతాధికారుల దష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వం ద్వారా వారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.కలికిరి : గాలివాన భీభత్సవంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని గుట్ట పాలెం, కలికిరి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో గాలివానతో పాటు ఉరుములు, మెరుపులు రావడంతో ప్రజ లు భయాందోళనకు గురయ్యారు. గాలివానకు బొప్పాయి, టమోటా, మామిడి చెట్లు నేలకొరిగాయి. ఈసారి అరకొరగా కాసిన మామిడికాయలు సైతం గాలివానకు పూర్తిగా నేల రాలాయని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండ లంలో ప్రధానంగా పండించే బొప్పాయి పంట గాలివానకు ధ్వంసం కావడంతో బొప్పాయి రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సంవత్సర కాలంగా వర్షం కోసం ఎదురు చూస్తున్న రైత న్నలకు సోమవారం కురిసిన వర్షంతో కొంత ఉపశమనం లభించిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

➡️