పట్టణ అభివద్ధే ధ్యేయం : ఎమ్మెల్యే

ప్రజాశక్తి-మదనపల్లి పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అన్నారు. పురపాలక సంఘంలోని కౌన్సిల్‌ హాల్‌లో శనివారం చైర్‌పర్సన్‌ మనూజ కిరణ్‌ అధ్యక్షతన జరిగిన పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్‌ సమావేశంలో ఎమ్మెల్యే కౌన్సిల్‌ ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ప్రమాణం చేశారు. అంతకుముందు పట్టణంలోని టిడిపి, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని స్కూటర్‌ ర్యాలీ నిర్వహించి పురపాలక సంఘ కార్యాలయం ఆవరణ ముందు ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. పురపాలక సంఘం పూర్తిగా పసుపు మయంగా మార్చేశారు. పసుపు రంగు బెలూన్లతో అలంకరించారు భారీ జనము మధ్య మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లోకి ఎమ్మెల్యేరాగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు, చైర్‌పర్సన్‌, కమిషనర్‌ ప్రమీల, పురపాలక సంఘ సిబ్బంది ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్‌బాష మాట్లాడుతూ పార్టీలకు, కులమతాలకతీతంగా మదనపల్లి పట్టణాభివద్ధి ద్యేయంగా పనిచేస్తానని అందుకు పురపాలక కౌన్సిల్‌ సభ్యులు, సిబ్బంది గురించి పట్టణ అభివద్ధికి ప్రతి ఒక్కరూ సహకరిం చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ నిధులు సైతం ఏమాత్రం పట్టణ అభివద్ధిపై వెచ్చించలేదన్నారు. ఇకపై అలాంటివి జరగనివ్వనని మున్సిపల్‌ అభివద్ధికి కావాల్సిన నిధులను పూర్తిస్థాయిలో అందించి పట్టణాభివద్ధి ధ్యేయంగా పని చేస్తానని పేర్కొన్నారు. అనంతరం వైస్‌చైర్మన్‌లు జింక వెంకటాచలపతి, నూర్‌ ఆజాం మాట్లాడుతూ పట్టణంలో రాబోయే వర్షా కాలాన్ని దష్టిలో ఉంచుకొని పరిశుభ్రత పాటించే విధంగా సిబ్బంది పనిచేయాలన్నారు. మురుగినీటి కాలువలలో పేర్కొన్న మట్టి మురుగును ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్‌, కమిషనర్లను కోరారు. కౌన్సిలర్లు సుధాకర్‌, రాజేష్‌, కరిముల్లా, గిరిజా సాయి శేఖర్‌ రెడ్డి, ఆర్కే తులసి, పాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ పట్టణ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, కుక్కల బెడద, బోర్ల మరమ్మతులు, నీటి సరఫరా పై సిబ్బంది సకాలంలో స్పందించాలని కోరారు. అనంతరం కౌన్సిల్‌ అజెండాలోని 70 అంశాలను ఏకగ్రీవంగా సభ్యులందరూ ఆమోదాన్ని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️