అందరి సహకారంతో నగర అభివృద్ధి

Jan 24,2024 21:30

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : అందరి సహకారంతో రానున్న రోజుల్లో సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని మేయర్‌ విజయలక్ష్మి, ఫ్లోర్‌లీడర్‌ ఎస్‌వివి రాజేష్‌ అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్‌ అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఎజెండాలో పొందుపరిచిన 20 అంశాలకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టేలా అధికారులను ఆదేశించామన్నారు. సమావేశంలో కమిషనర్‌ ఆర్‌.శ్రీరాములనాయుడు, సహాయ కమిషనర్‌ ప్రసాదరావు, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు పట్నాన పైడిరాజు, బోనెల ధనలక్ష్మి, పిన్నింటి కళావతి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

➡️