సంక్షేమ సారథులు వాలంటీర్లే

Feb 22,2024 21:11

ప్రజాశక్తి-రామభద్రపురం : సంక్షేమ సారథులు వాలంటీర్లేనని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు కితాబిచ్చారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సుపరిపాలన అందించడానికి సిఎం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కరేనని అన్నారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలు పేరిట నియమించిన దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాలంటీర్ల సేవల వల్లే ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందన్నారు. అందుకే వాలంటీర్లని ప్రోత్సహించడానికి పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని సుమారు 45 లక్షల రూపాయలు నగదును బహుమతిగా అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఈశ్వరమ్మ, జెడ్‌పిటిసి అప్పికొండ సరస్వతమ్మ, తహశీల్దార్‌ సులోచనరాణి, తదితరులు పాల్గొన్నారు.

➡️