హోరాహోరీగా బాక్సింగ్‌ పోటీలు

రింగ్‌లో తలపడుతున్న క్రీడాకారులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్థానిక రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలోని బాక్సింగ్‌ కోర్టులో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌-14, 17, 19 బాక్సింగ్‌ రాష్ట్ర పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండు బాక్సింగ్‌ రింగుల్లో జరుగుతున్న పోటీలు బుధవారంతో ముగియనున్నాయి. లీగ్‌ దశ పోటీలు మంగళవారంతో ముగిశాయి. బుధవారం సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ మ్యాచ్‌లు మూడు విభాగాల్లో నిర్వహించనున్నారు. రెండో రోజు పోటీలను తిలకించేందుకు అధిక సంఖ్యలో క్రీడాకారులు, నగర ప్రజలు హాజరయ్యారు.

➡️