సిఆర్‌టిలందర్నీ రెన్యువల్‌ చేయాలి : యుటిఎఫ్‌

May 8,2024 21:26

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌  : రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిఆర్‌టిలందర్నీ రాబోయే విద్యాసంవత్సర ప్రారంభంలోనే రెన్యూవల్‌ చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. బుధవారం పార్వతీపురంలో జరిగిన సీఆర్టీల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత పోరాటాల ఫలితంగా రెగ్యులర్‌ అయిన సిఆర్టీ లందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేయాలని కోరారు. ఏ సమస్య పరిష్కారమైనా పోరాటాల ద్వారానే సాధ్యమని తెలిపారు. సీఆర్టీల పోస్ట్‌ లను డీఎస్సీ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రెగ్యులర్‌ అయిన ప్రతి సిఆర్‌టి అత్యంత బాధ్యతతో ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌, ఆర్‌.మోహనరావు, ఎస్‌. కిషోర్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షుడు తోట రమేష్‌, సిఆర్‌టిల నాయకులు రాజగోపాల్‌, మురళి, తదితరులు పాల్గొన్నారు.వైసిపి, టిడిపిలను నమ్మొద్దు ప్రజాశాంతి పార్టీ విశాఖ ఎమ్‌పి అభ్యర్థి కె.ఎ.పాల్‌ ప్రజాశక్తి – జామి /శృంగవరపుకోటరాష్ట్రంలో వైసిపి, టిడిపిలను నమ్మొద్దని ప్రజాశాంతి పార్టీ విశాఖ ఎమ్‌పి అభ్యర్థి డాక్టర్‌ కె.ఎ.పాల్‌ ప్రజలను కోరారు. బుధవారం శృంగవరపుకోట, జామిలో ఆయన ప్రచారం చేశారు. విశాఖపట్నం అభివృద్ధికి పాటుపడతానని ఆయన అన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పేదవాడు వెయ్యి రూపాయలు కోసం పడరాని పాట్లు పడుతుంటే, రాజకీయ నాయకులు రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. ప్రజాశాంతి తరపున విశాఖ ఎమ్‌పిగా పోటీ చేస్తున్న తనను కుండ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.చంద్రబాబు సభ ఏర్పాట్లు పరిశీలనప్రజాశక్తి – కురుపాంటిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం నియోజకవర్గ కేంద్రమైన కురుపాం పర్యటన నేపథ్యంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌ కురుపాంలో గల సాయిరాం గుడి సమీపాన గల మైదానంలో హెలిప్యాడ్‌ ల్యాండింగ్‌ అయిన స్థలం, రావాడ కూడలి వద్ద జరుగు సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు చంద్రబాబు సభకు చేరుకుంటారని, కావున టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్‌ కుమార్‌, తదితరులు ఉన్నారు.

➡️