కబడ్డీ ఆడీ అంగన్వాడీల నిరసన

Dec 31,2023 13:04 #Vizianagaram
anganwadi workers strike 20th day vzm

20వ రోజుకి చేరిన సమ్మె
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ లు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 20వ రోజుకి చేరుకుంది. సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక దీక్ష శిబిరం వద్ద కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. కబడ్డీ లో వేతనాలు పెంచాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చెయ్యాలని కూత పెట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ లు సహనాన్ని పరీక్షిస్తుందని,మహిళలు ఆగ్రహానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురి కావోద్దని హెచ్చరించారు. మా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతుంటే సమస్యలు పరిష్కారం చేయకపోగా బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదన్నారు. మేము తాటాకు చప్పలకు భయపడేది లేదని, మా సమస్యలు పరిష్కారం చేసి మా వేతనాలు పెంచే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే దిగి వచ్చే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుశీల, రాధ, ఉష, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️