పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలి

Jan 11,2024 16:17 #Vizianagaram
anganwadi workers strike 31day in vzm

ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగే చర్చల్లో అంగనవాడి సమ్మెను పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ ,రామ్మూర్తి నాయుడు రాజాం తాసిల్దార్ కార్యాలయం వద్ద 31 వ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభిస్తూ డిమాండ్ చేశారు.
రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మూడు దపాల చర్చలు జరిపినప్పటికీ అంగన్వాడీలకి ఏ రకమైనటువంటి న్యాయం చేసే పరిస్థితిలో చర్చలు లేవని, నేటికీ 31 రోజులుగా అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం చేస్తున్న నిర్బంధాన్ని తట్టుకొని సమ్మెలో పాల్గొంటే ఇది చూడలేని ప్రభుత్వం ఎస్ మా పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తూ అంగన్వాడీలకు షోకాస్ నోటీసులను అంగనవాడి కేంద్రాలకు కార్యకర్తల ఇంటిలకు అంటించడం సరైనది కాదని, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను భయపెట్టాలని చూసి బంగపాటు గురి కావద్దని హెచ్చరించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జరిగే చర్చల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అంగీకరించి అమలు చేసే విధంగా ఉండాలని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని తెలిపారు ఈ దీక్షలో యూనియన్ నాయకులు బి ఉమా కుమారి ,సునీత ,భారతి ,చిన్నముడు ,మంగమ్మ, వనజ ,పార్వతి ,ఈశ్వరమ్మ ,ఉమా ,కాళీరత్నం, పుణ్యవతి, విజయ్ కుమారి మొదలగువారు పాల్గొన్నారు.

➡️