చిన చామలాపల్లిలో నిరసన

Mar 14,2024 11:18 #Vizianagaram

ప్రజాశక్తి-గజపతినగరం : దేశవ్యాప్త పిలుపులో భాగంగా రైతు సంఘాల సమైక్య సమితి, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా చిన చామలాపల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం జరిగింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి సూర్యనారాయణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతులకు నష్టం తెచ్చే విధానాలు అమలు చేస్తున్నారు. గిట్టుబాటు ధర చట్టం తెస్తామని స్వామినాథన్ సిఫార్యులు అమలు చేస్తామని ఇచ్చిన హామీని పక్కన పెట్టేశారు. నల్ల చట్టాలను దొడ్డి దారిన అమలు చేస్తూ రైతన్న హత్యలను పెంచే విధంగా పాలన చేస్తున్నారు. ఉపాధి హామీ చట్టాలను నీరుగారిస్తున్నారు కార్మిక కోడ్లు తెచ్చి కార్మిక హక్కులు కాలరాస్తున్నారు. పేదలకు భూములు పట్టాలు ఇవ్వకపోగా గిరిజనులు పేదలు భూములు కార్పొరేటర్లకు అప్పగించి కుట్రలు పూనుకున్నారు. రైతు రుణమాఫీ వేయడంలేదు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయడం లేదు ప్రభుత్వానికి సంస్థలు ప్రైవేటీకరణ చేసి ప్రజల ఆస్తి ప్రైవేట్ పరం చేసి ప్రజలకు నష్టం తెచ్చి పెడుతున్నారు. కావున మోడీ ప్రభుత్వం రైతు రక్షణకు మద్దతు ధర చట్టం తేవాలి. రుణమాఫీ చేయాలి సమగ్ర పంటల భీమా పథకం పెట్టాలి ఉపాధి హామీకి రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి 200 రోజులు పని కల్పించి 600 రూపాయలు కూలి గిచ్చిబౌట్ చేయాలి. కార్మిక కోడ్లు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తు కోసం ప్రజానీకం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘాల జిల్లా కార్యదర్శి ఆర్ రాములు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ నాయుడు మరియు చిన చామలాపల్లి గ్రామ రైతులు కూలీలు వృత్తిదారులు, జి. తిరుపతి, బి. లక్ష్మణ, ఎం.ఎరుకు నాయుడు, టి.శంకర్, బాయ్ వెంకట్రావ్, టి. మహేష్, బమ్మిడి రమణ, హరి నరసింహులు, ఆవాలు తౌడమ్మా, బోను .రాములమ్మ, దాకరాపు బంగారమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️