మాక్‌ పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించిన ఆర్‌ఒ

May 4,2024 21:41

సాలూరు: సాలూరు శాసనసభ నియోజక వర్గంలో ఇవిఎం మాక్‌ పోలింగ్‌ ప్రక్రియను శనివారం చేపట్టారు. ఈ ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారి సి.విష్ణు చరణ్‌ పరిశీలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఏర్పాట్లు తనిఖీ చేశారు. ఇవిఎంల్లో గుర్తుల లోడింగ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దార్లు సింహాచలం, ఆనంద్‌కుమార్‌, ఎంపిడిఒ ఫణి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️