విజయనగరంలో అంగన్వాడీల ఉగ్రరూపం

Dec 18,2023 16:15 #Vizianagaram
vzm anganwadai strike continue 7th day collectorate

తాళాలు పగలు కొట్టిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుంటే జగనన్నకు తగిన గుణపాఠం
ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్సు యూనియన్ హెచ్చరిక
కలెక్టరేట్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శన
ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలు కొట్టిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎపి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన శిభిరం నుంచి ఆర్డీఓ కార్యలయం వరకు వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ బయటకు వచ్చి మా సమస్యలు వినాలని, తాళాలు పగలు కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయకాయాన్ని ముట్టడించారు. ఆర్డి ఓ ఎప్పటికీ రాకపోవడంతో ఆర్డీఓ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు అంగన్వాడీ లు ప్రయత్నించారు. దీంతో ఒకటవ పట్టణ సి ఐ పరిస్థితిని ఆర్డీఓ కి వివరించారు.దీంతో మధ్యాహ్నం 1 గంట కు ఆర్డీవో వచ్చి సమస్యలు వినేందుకు అంగన్వాడీ వర్కర్స్ లు దగ్గరికి రావడం జరిగింది .దీంతో సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పైడిరాజు, ఎస్.అనసూయ, కృష్ణవేణి తదితరులు మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు తలుపులు తాళాలు బద్దలు కొట్టి లోపల ప్రవేశాలు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ మా సమస్యలు పరిష్కరించాలని అన్నారు. కత్తులు, సుత్తులు పట్టుకొని వచ్చి భయబ్రాంతులకు సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ కేంద్రాలను తాళాలు బద్దలు కొట్టే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. చాలా కేంద్రాలు అద్దెకు ప్రైవేటు ఇళ్లలోనడుస్తున్నాయని, తాళాలు ,తలుపులు బద్దలు కొడుతున్నారు అంగన్వాడీ వర్కర్స్ దే బాధ్యత అని అద్దెకు ఇచ్చిన యజమానులు ఆ నష్టాన్ని మా మీద వేస్తున్నారని అని తెలిపారు. ఈ విధంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి స్పందిస్తూ!మీ సమస్యలు పరిష్కారం కోసం మీ యొక్క వినతిపత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, సి ఐ టి యు నాయకులు బచ్చల సూర్యనారాయణ, బి.రమణ, ఐద్వా జిల్లా కార్యదర్శి పి రమణమ్మ, ఆశా వర్కర్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి,ఎపి మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యు ఎస్ రవికుమార్, ఏ ఐ టి యు సి నాయకులు డి.అప్పలరాజు, పి.అప్పారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కంది.త్రినాథ్ ,విజయనగరం,ఎస్ కోట,వేపాడ,కొత్తవలస మండలాలు నుంచి అధిక సంఖ్యలో అంగన్వాడీ వర్కర్స్, ఆయాలు పాల్గొన్నారు.

➡️