అవినీతిని ఆధారాలతో చూపిస్తాం.. ఎమ్మెల్యే చర్చకు సిద్దమా !

Mar 19,2024 15:49 #vijayanagaram

మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్  : కాళ్ళ గౌరీశంకర్


ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఆయన అనుచరులు చేసిన అవినీతిని ఆధారాలతో చూపించేందుకు మేము సిద్దం, ఎమ్మెల్యే కోలగట్ల సిద్ధమా అని అర్భన మాజీ చైర్మన్ కాళ్ళ గౌరీశంకర్ సవాల్ విసిరారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అవినీతి బాగోతాలు
సీరియల్ మాదిరిగా స్వామి లీలలు నగరంలో ఉన్నాయన్నారు. అధిక వడ్డీ కాసులువాడు ఎమ్మెల్యే కోలగట్ల అని అన్నారు. ఆయన తలచుకుంటే తప్ప.. ఇల్లు, గ్రూపు హౌస్ కట్టుకొలేని పరిస్తితి నగరంలో నెలకొందన్నారు. ఇల్లు కట్టే ముందు సచివాలయం సిబ్బంది, అధికారులు చెప్పేది ఎమ్మెల్యే స్వామిని కలవాలనీ లేదంటే అనుమతి లేని పరిస్తితి ఉందన్నారు. చిట్ వ్యాపారంలో చీటి వేస్తే తప్ప ఇల్లు కట్టుకోలేని దౌర్భాగ్యం బిల్డర్లు కు నగరంలో నెలకొందన్నారు. లే అవుట్ వేసుకుంటే ఆయన అనుమతి పొందాలి. లే అవుట్ లో అల్లుడు కు షేర్ ఇవ్వకపోతే ఆ పని జరగటం లేదని లే అవుట్ వేసిన వాళ్ళు చెబుతున్నారాన్నారు. సుందరీకరణ పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఉండి పోయిన నిధులతో నేడు ఈయన శత శంకుస్థాపనలు పేరుతో పనులు చేపట్టారన్నారు. ఎమ్మెల్యే నిధులతో ఏ ఏ పనులు చేసారో ఆయన చెప్పాలన్నారు. కార్పొరేషన్ నిధులతో అభివృద్ది చేసి,మేయర్ , పాలకవర్గం పేరు లేకుండా ఎమ్మెల్యే అభివృద్ది చేసినట్లు చెప్పుకోవడం జరుగుతుందన్నారు. అంబటి సత్రం రోడ్డుకి ఎక్విజిషేన చేసింది టిడిపి వాళ్ళే… ఎమ్మెల్యే చేసింది ఏమి లేదన్నారు. బెదిరించి మూడు లాంతర్లు నుంచి కన్యకాపరమేశ్వరి కోవెల వరకు రోడ్డు వెడల్పు చేయించిన విషయం ప్రజలకు తెలుసునని అన్నారు.సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, నగర పాలక సంస్థ కార్యాలయం లో కి వెళితే అవినీతి జరగకుండా అవినీతి లేకుండా పని జరగడం లేదన్నారు. ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ఆధారాలతో చూపిస్తామన్నారు. రోటరిక్లబ్ సభ్యులు మద్య అవినీతిని నిరూపించడానికి సిద్దం దమ్ముంటే సిద్దమా అని సవాల్ ఎమ్మెల్యేకు విసిరారు. విలేకర్ల సమావేశంలో ఆయన అనుచరులు పాల్గొన్నారు. 

➡️