తల్లిదండ్రుల చెంతకు బాలిక

Nov 27,2023 22:31

ప్రజాశక్తి – పెనుగొండ
తల్లి మందలించిందని మనస్తాపానికి గురై ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన బాలిక ఐశ్వర్య పెనుగొండ భాష్యం స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతుంది. ఈ క్రమంలో సరిగా చదవడంలేదని ఐశ్వర్య తల్లి ఈ నెల 24వ తేదీన మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక శనివారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం పాఠశాల అయిపోగానే పెనుగొండలో బస్సు ఎక్కి ద్వారకాతిరుమల వెళ్లిపోయింది. కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అదేరోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక ద్వారకాతిరుమలలో ఉందని తెలుసుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులకు అప్పగించారు. సోమవారం ఉదయం బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

➡️