వాలంటీర్లు బాధ్యత తీసుకోవాలి

పాలకోడేరు ఎంపీపీ చంటి రాజు

ప్రజాశక్తి – పాలకోడేరు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాలంటీర్లు బాధ్యతతో పనిచేయాలని ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణ రాజు (చంటిరాజు) అన్నారు. పెన్నాడ అగ్రహారంలో సర్పంచి చిల్లా అనూష సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల బోర్డును ఎంపిపి చంటి రాజు, వైసిపి జెండాను పార్టీ మండల అధ్యక్షులు కటిక శ్రీదేవి ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభకు సర్పంచి అనూష సత్యనారాయణ అధ్యక్షత వహించగా ఎంపిపి చంటిరాజు మాట్లాడారు. గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలకంటే వాలంటీర్లకే ఎంతో విలువ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ఎంపిపిలు నరేష్‌, లక్ష్మీతులసి, సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపతి రాజు వంశీకృష్ణంరాజు, బోల్ల శ్రీనివాస్‌, నాయకులు మంతెన సుబ్రహ్మణ్యంరాజు, చెల్లబోయిన పాపారావు పాల్గొన్నారు.

➡️