అంగన్వాడీల సమ్మెకు మాజీ ఎమ్మెల్సీ అంగర సంఘీభావం

Dec 31,2023 15:30 #West Godavari District
anganwadi workers strike 20th day wg

 

ప్రజాశక్తి-పాలకొల్లు : పనికి తగ్గ వేతనం ఇవ్వాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరింది. అంగన్వాడీలు ఆట పాటలతో ప్రభుత్వం కు వ్యతిరేకంగా పాటలు పాడారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ శిబిరం వద్దకు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ వచ్చి సంఘీభావం తెలిపారు. అమ్మ తరువాత అమ్మ వలె లాలిస్తున్న అంగన్వాడీలకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ న్యాయం అని అన్నారు. ఇంకా సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్ పాల్గొన్నారు.

➡️