ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి

May 11,2024 22:21

నరసాపురం పార్లమెంట్‌ వ్యయ పరిశీలకులు పియూష్‌ శుక్ల
ప్రజాశక్తి – భీమవరం
అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని నరసాపురం పార్లమెంట్‌ వ్యయ పరిశీలకులు పియూష్‌ శుక్లా అన్నారు. కలెక్టరేట్‌లో నరసాపురం పార్లమెంట్‌ నియోజవర్గంలో పోటీలో ఉన్న 21 మంది అభ్యర్థుల ప్రచారాలకు సంబంధించి వ్యయాల రిజిస్టర్లను పియూష్‌ శుక్లా శనివారం క్షుణంగా పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారంలో చేసే ఖర్చులను షాడో బృందాలు, ఎంసిఎంసి సెల్‌ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు ప్రచారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార ఖర్చులో వాటిని లెక్కించడం జరుగుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్నారు. జిల్లాలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం పార్టీల అభ్యర్థులు నడుచుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఖర్చును మాత్రమే చేయాలని, నిబంధనలను అతిక్రమించి ఎక్కువ ఖర్చును చేస్తే అనర్హత వేటు పడుతుందని పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యయ పరిశీలకుల సహాయకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️