ఉచిత కంటి వైద్య శిబిరంలో 86 మందికి పరీక్షలు

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం

లయన్‌ పదం కుమార్‌ గుప్తా(డిస్ట్రిక్ట్‌ డిప్యూటీ గవర్నర్‌) ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరంలో 86 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. పట్టణంలోని కడకట్ల జనతా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆవరణలో ఆదివారం తాడేపల్లిగూడెం లైన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యాన క్లబ్‌ అధ్యక్షులు వంగపండు రామోహనరావు అధ్వర్యంలో నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్‌ నేత్ర వైద్యశాల వైద్యుల బృందంతో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉచిత కంటి ఆపరేషన్లు నిమిత్తం 10 మందిని నిడదవోలుకు పంపారు. 15 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. లయన్‌ రవి కుమార్‌(యశోద హాస్పిటల్‌, తాడేపల్లిగూడెం) ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా లయన్స్‌ క్లబ్‌ మెంబర్‌ అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, తన వంతుగా లైన్స్‌ క్లబ్‌ తరఫున ఎలాంటి సేవా కార్యక్రమాలైనా చేయడానికి ముందు ఉంటానని ఆయన అన్నారు. లయన్స్‌ క్లబ్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదన్‌ మోహన్‌ అగర్వాల్‌(రీజియన్‌ ఛైర్‌పర్సన్‌) కార్యదర్శి చిన్నం జగదీష్‌, బాపయ్య శర్మ పాల్గొన్నారు.

➡️