స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతను పరిశీలించిన ఐజి, ఎస్‌పి

ప్రజాశక్తి – ఏలూరు

ఏలూరు సిఆర్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎన్నికల అనంతరం ఇవిఎం ప్యాడ్‌లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద భద్రతను ఏలూరు రేంజ్‌ ఐజి జివిజి.అశోక్‌కుమార్‌, జిల్లా ఎస్‌పి డి.మేరీప్రశాంతి పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందని ఏలూరు రేంజ్‌ ఐజి అశోక్‌కుమార్‌ తెలిపారు. మూడంచెల భద్రత నడుమ బ్యాలట్‌ బాక్స్‌ల స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద 24/7 పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉందని తెలిపారు. ప్రతి స్ట్రాంగ్‌ రూమ్‌ పరిసరాల్లో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌కు నలువైపులా పోలీస్‌ పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ గార్డ్‌ సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలన్నారు.

➡️