ఆర్యవైశ్య సంఘ జిల్లా ఉపాద్యక్షుడిగా నూలి శ్రీనివాస్

Apr 1,2024 13:01 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం( పశ్చిమగోదావరి జిల్లా): ఆర్య వైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడిగా నర్సాపురం పట్టణానికి చెందిన నూలి శ్రీనివాస్ నాలుగో పర్యాయం బాధ్యతలు చేపట్టారు. ఆదివారం పాలకొల్లు గామాస్ కళ్యాణ మండపంలో ఆర్య వైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకనాథ్, విశిష్ట అతిధి శ్రీకాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి ల సమక్షంలో నూలి శ్రీనివాస్ ఆర్యవైశ్య సంఘ జిల్లా ఉపాద్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘకాలం నుంచి నర్సాపురం బీజీబీఎస్ మహిళా కళాశాల, సర్విశెట్టి సంస్కృతిక ఉన్నత పాఠశాలల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా వ్యవహరిస్తూ ఆ విద్యా సంస్థల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. అదేవిదంగా అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యోగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కూడా నూలి శ్రీనివాస్ విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘ జిల్లా ఉపాద్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నూలి శ్రీనివాస్ కు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, నాయకులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు తదితరులు అభినందనలు తెలియజేశారు.

➡️