ఉపాధి కల్పనలో సర్పంచులు చొరవ తీసుకోవాలి

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం రూరల్‌

ఉపాధి కూలీలకు పని కల్పించడంలో స్థానిక సర్పంచులు కూడా చొరవ తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు సూచించారు. మండలంలోని కృష్ణయ్యపాలెం, ఉప్పరగూడెం గ్రామాల్లోని కూలీలను ఆయన సోమవారం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూలీలకు పూర్తిస్థాయిలో అధికారులు పని కల్పించడం లేదన్నారు. దీంతో కూలీలు అనేక ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు పనులు కల్పించడంలో స్థానిక సర్పంచులు చొరవ తీసుకోవాలని సూచించారు. రోజు వారి వేతనం రూ.600 ఇవ్వాలని, పాత పనిముట్ల స్థానంలో కొత్త పనిముట్లు ఇవ్వాలని కోరారు. కేంద్ర బడ్జెట్‌లో రూ.రెండు లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జి.రంగారావు,సిహెచ్‌ నాగేశ్వరరావు,జి.గంగ భవాని,పోట్ల ధనలక్ష్మి, ధర్మయ్య, గంజి లక్ష్మణరావు, కె.మేరీ కుమారి, నత్త రాధ, మరపట్ల వెంకటరావు, సిహెచ్‌.సుజాత, ఎడ్లవల్లి వేణు పాల్గొన్నారు.

➡️