క్రీడల పట్ల ఆసక్తి చూపాలి

ఉప సర్పంచి సుబ్రహ్మణ్యం

ప్రజాశక్తి – పెనుగొండ

గ్రామాల్లో క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలని, చెడు అలవాట్లకు దూరం చేయడానికి దోహదపడుతుందని ఉప సర్పంచి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఆరోగ్యం, శారీరకంగా ధృడత్వం పొందుతారని, ఈ క్రీడల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. మండలం దేవ గ్రామంలో గత పదిరోజులుగా జరుగుతున్న అంబేద్కర్‌ అండర్‌-17 క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌లో విజేతగా తాళ్లపాలెం జట్టు గెలుపొంది విన్నర్‌గా నిలిచింది. విజేతకు మొదటి బహుమతి దేవ ఉపసర్పంచి ఆర్థిక సహాయంగా రూ.3 వేలు ఫ్రైజ్‌ మనీ, కప్‌ను స్పాన్సర్‌ చేసి అందజేశారు. రెండవ బహుమతిగా రూ.1500 క్యాష్‌, కప్‌ను సబ్బితి జీవన్‌ రాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పాలపర్తి సుబ్రహ్మణ్యం, నేలపుడి చినబాబు, దొడ్డి చంటి, పాలపర్తి సుమంత్‌, గూనపాటి చిట్టిబాబు పాల్గొన్నారు.

➡️