గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

మొగల్తూరు: ముత్యాలపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఐసెట్టి మల్లిఖార్జునరావు(49) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. మొగల్తూరుకు చెందిన మల్లిఖార్జునరావు గత ఏడాది బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం తన ఇంటిలో ఉండగా ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అదే నిమిషంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు కలరు. మల్లిఖార్జునరావు మృతి విషయాన్ని తెలుకున్న ఆయన స్నేహితులు ముత్యాలపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, యుటిఎఫ్‌ మండల ఉపాధ్యాయులు మల్లిఖార్జునరావు భౌతిక ఖాయాన్ని దర్శించి నివాళులర్పించారు.

➡️