సిపిఎఫ్‌ యాజమాన్యం మొండి వైఖరి వీడాలి

ప్రజాశక్తి – గణపవరం

సరిపల్లిలోని సిపిఎఫ్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని కోరుతూ ఆ ఫ్యాక్టరీ ఉద్యోగ, కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జుత్తిగ గోపాలన్‌, కె.రాజారామ్మోహన్‌రారు మాట్లాడుతూ సిపిఎఫ్‌ ఉద్యోగ, కార్మికుల సమస్యపై ఏలూరులో డిసిఎల్‌ కార్యాలయంలో ఫ్యాక్టరీ యజమానులకు, ఉద్యోగులకు జాయింట్‌ సమావేశం ఏర్పాటు చేశారని, ఈ సమావేశానికి ఫ్యాక్టరీ ప్రతినిధులు గైర్హాజరయ్యారని అన్నారు ఉద్యోగ కార్మికులకు న్యాయం చేయకుండా యాజమాన్యం మొండి వైఖరితో ఉన్నట్టు కన్పిస్తోందన్నారు. 22 రోజులుగా కార్మిక, ఉద్యోగులు నిరసన తెలుపుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. యాజమాన్యం చర్చలకు రాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఉద్యోగ కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు. కార్యక్రమంలో నేతలు యాసారాపు రామకృష్ణ, నంద్యాల శివరామరాజు, గన్నాబత్తుల కోటేశ్వరరావు, కవల నాగేశ్వరావు, మేకా రమేష్‌, జాలెం నరేంద్ర, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️