దంచి కొడుతున్న ఎండ.. ఒబ్బిడైన వరి మాసూళ్లు

ఆనందంలో రైతులు

ప్రజాశక్తి – పెనుమంట్ర

గడచిన వారం రోజులుగా ఎండా, వాన, మబ్బులతో ఇబ్బంది పెట్టిన వాతావరణం బుధవారం ఎండతో బాగా దంచి కొట్టడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే కోతలు పూర్తయ్యి వ్యవసాయ కల్లాల్లోను, రోడ్ల మార్జిన్లకు చేర్చిన ధాన్యం మాసూళ్లు చేసే పనిలో వారు పాల్గొన్నారు. గత వారంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఢలాీ పడ్డ రైతులు, కౌలు రైతులు ఉత్సాహంగా పనుల్లో పడ్డారు.

➡️