విద్యార్థిని కంటి వైద్యానికి వాకర్స్‌ క్లబ్‌ ఆర్థిక సాయం

ప్రజాశక్తి – పాలకొల్లు

పాలకొల్లు బిఆర్‌ఎంవి పురపాలక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న చవ్వాని మేరీ బ్లాండినా అనే పేద విద్యార్థిని కంటి వ్యాధితో బాధపడుతూ విద్యాభ్యాసంలో ఇబ్బందులు పడుతోంది. దాతలు స్పందించి కొంత ఆర్థిక సాయం అందించగా ఇంకనూ అవసరమైన రూ.5 వేలను వాకర్స్‌ క్లబ్‌ పాలకొల్లు అధ్యక్షుడు తటవర్తి సుధాకర్‌, సభ్యులు కొత్త కుళాయి చెరువు వద్ద అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి షేక్‌ పీర్‌ సాహెబ్‌, కోశాధికారి పోతుల ఉమాశంకరరావు, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, సలాది రామచంద్ర రావు, బొలిశెట్టి నాగరాజు, మేకా త్రిశూలపాణి పాల్గొన్నారు.

➡️