రైతులకు పట్టాలిచ్చాం

Apr 6,2024 11:21 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేరుగా 1602 రైతులకు 1754 ఎకరాల దర్భరేవు కంపెనీ భూములు, పట్టాలు అందిచామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని దర్భరేవు గ్రామంలో19 వ రోజు ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ప్రసాదరాజు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలందరికి మంచి చేసామన్నారు. ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేశామన్నారు.

➡️