మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు భాస్కరరావు, జిల్లా బాధ్యులు జగన్మోహనరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం కరపత్ర ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం , మున్సిపల్‌ అధికారులు సమస్యలపై చర్చించడం తప్ప, పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2022 జూలై 11 నుంచి 15 వరకు జరిగిన సమ్మెలో ఇంజనీరింగ్‌ కార్మికులకు, డ్రైవర్లకు రిస్కు, హెల్త్‌, ఆక్యు పెన్ష్‌ అలవెన్స్‌ అమలు చేస్తామన్న రాతపూర్వక ఒప్పందాన్నే తుంగలో తొక్కారని, పర్మినెంట్‌ లేదు, సమాన పనికి సమాన వేతనం లేదు, 11వ పిఆర్సి లో పెరిగిన వేతనాలని అమలు చేయకుండా ఒక్కొక్క కార్మికుని వేతనంలో నెలకు 5000 రూపాయలు కోత పెట్టారని, సబ్బులు నూనెలు చెప్పులు బ్లౌజులు వంటి రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని, నెల్లిమర్ల రామతీర్ధాలు ముసిడిపల్లి పంప్‌ హౌస్‌ కార్మికులకు నన్ను మెటీరియల్‌ వేరు చేయకుండా థర్డు పార్టీ విధానాన్ని కొనసాగిస్తున్నారని, క్లాస్‌ డ్రైవర్లకు 18500 ఇస్తామని 12000 చెల్లిస్తున్నారని , ఈ సమస్యలను పరిష్కరించమంటే ఇంకా మూడు నెలల సమయం కావాలని ప్రభుత్వం అడుగుతుందని, ప్రభుత్వ మాటలు పట్ల నమ్మకం లేనందున సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. కరపత్ర ప్రచార కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రామారావు, అశోకు, రామచంద్రరావు, రాజు, రమా తదితరులు పాల్గొన్నారు.

➡️