చాగల్లులో ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ

Apr 25,2024 11:36 #East Godavari, #hospital

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పుగోదావరి) : ప్రపంచ మలేరియా దినోత్సవంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బ్రాహ్మణ గూడెంలో డా.కేనిశిత, డాపిఆర్‌ఎల్‌ దేవి సమక్షంలో బ్రాహ్మణగూడెం గ్రామపరిధిలో అవగాహనా కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. రోజు విడిచి రోజు జ్వరం, వనుకుతో కూడిన జ్వరం, చెమటలు పట్టుట, తలనొప్పి, ఒంటి నొప్పులు, వాంతులు వంటివి మలేరియా వ్యాధి లక్షణాలని తెలిపారు. ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని, పడుకునేటప్పుడు దోమతెరలు తప్పని సరిగా వాడాలని తెలిపారు. పిల్లలకు చేతులు, కాళ్లకు నిండుగా ఉండే దుస్తులు వేయాలని.. సొంత చికిత్స చేయకుండా, దగ్గరలో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలని.. వైద్యులు సూచించిన మందులు తప్పనిసరిగా వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.పద్మ, ఏ.రామచంద్రం, ఎస్‌.సారమ్మ , ఎం.రాజశేఖర్‌, డీవీ.రామకృష్ణ , పి.శ్రీనివాస్‌, ఆరోగ్య కార్యకర్తలు, ఏ డబ్ల్యు డబ్ల్యు , ఆశలు పాల్గొన్నారు.

➡️