వైసిపి అరాచకాలకు భయపడేది లేదు

ప్రజాశక్తి – కడప అర్బన్‌ వైసిపి నాయకులకు చంపడం, నరకడం వచ్చు, సొంత బాబాయిని చంపిన వీళ్లకు మనం ఒక లెక్క కాదు. నేను కడపకు వచ్చానంటే టిడిపి కార్యకర్తలు అండగా ఉన్నారని ధైర్యంతో వచ్చా అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. గురువారం నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా 44వ డివిజన్‌లో మతిచెందిన చండ్రాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. మతుని భార్య రామలక్ష్మమ్మకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రం భూ ఆక్రమణలు, కల్తీ మద్యం, ఇసుక మాఫియా, గంజాయి అక్రమ విక్రయాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. మండుటెండను సైతం లెక్కచేయని మీ అభిమానానికి నా నమస్కారాలు అన్నారు. చంద్రబాబు రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు ఎలా కష్టపడ్డారో మీకు బాగా తెలుసని చెప్పారు. మరో ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రం ఎలా అభివద్ధి చెందేదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందని తెలిపారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు పేర్కొన్నారు. పైగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్కనున్న రాష్ట్రాలకు వెళ్లిపోయాయని చెప్పారు. వైసిపి రాక్షస పాలనలో టిడిపి కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందని తెలిపారు. వైసిపి చేసే ప్రతి తప్పును చంద్రబాబుపై నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. టిడిపి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని తెలిపారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో టిడిపి కార్యకర్తలు సై అంటే సై అనేలా ముందుకొచ్చి నిజాన్ని గెలిపించాలని కోరారు. టిడిపి జెండాను ఎగరేయడానికి కషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురువారం ప్రొద్దుటూరులోని పెద్ద శెట్టిపల్లి గ్రామానికి వచ్చారు. ప్రొద్దుటూరు మండలం పెద్ద శెట్టిపల్లె గ్రామంలోని ఒకటవ వార్డు మెంబర్‌ కూరపాటి రాధా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సమయంలో గుండెపోటుతో మతి చెందాడు. విషయం తెలుసుకున్న నారా భువనేశ్వరి, కూరపాటి రాధా ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరా మర్శించారు. అనంతరం రూ. 3 లక్షలను కూరపాటి రాధా కుటుంబ సభ్యుల పేరు మీద బ్యాంకులో డిపాజిట్‌ చేసి ఆ పత్రాలను రాధా కుటుంబ సభ్యులకు భువనేశ్వరి అందజేశారు. కార్యక్రమంలో టిడిపి ఇన్‌ఛార్జి జి.వి. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి, ఎంపీ అభ్యర్థి భూపేష్‌ రెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు బాబుల్‌ రెడ్డి పాల్గొన్నారు.నారా భువనేశ్వరిని కలిసిన మడక చక్రధర్‌ కడప : నారా భువనేశ్వరికి కడప విమానాశ్రయంలో తొగటవీర క్షత్రియ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు మడక చక్రధర్‌ ఘన స్వాగతం పలికారు. ఆనాడు చంద్ర బాబు జైల్లో ఉన్న సమ యంలో చనిపోయిన కుటుం బాలను పరామర్శించేందుకు గురువారం నారా భువనేశ్వరి కడపకు వచ్చారు. విమానాశ్రయంలో ఆమెకు మడక చక్రధర్‌ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు.

➡️