నియంత్రణ లేని పుస్తకాల ఫీజు

May 26,2024 04:50 #books, #edit page

త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రచారం, ప్రవేశాలు, ఫీజు వసూలు ప్రారంభమయ్యింది. ఫీజులు పట్ల నియంత్రణ లేకపోవడం వల్ల మధ్య తరగతి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఫీజులతో పాటు ”పుస్తకాల ఫీజు” భారీగా వసూలు చేయడం చాలా అన్యాయం. అవసరం లేని పుస్తకాలను ప్రైవేట్‌ పబ్లికేషన్స్‌, నోట్స్‌ల పేరుతో పుస్తకాలు ధరకు రెట్టింపు ధరగా చేసి కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలో దోపిడీ జరుగుతుంది. విద్యార్థుల వయస్సు, మానసిక స్థితిని అర్థం చేసుకోకుండా ధనార్జనే ధ్యేయంగా జరుగుతున్న ఈ వ్యవహారం ప్రజలకు గుదిబండగా మారింది. ”బుక్‌ ఫీజు” పేరుతో భారీగా వసూలు చేస్తున్న విధానాన్ని అరికట్టాలి. తాము చేస్తున్న దోపిడీ బయట పడకూడదని పుస్తకాల ఫీజును లెక్కల్లో చూపించకపోవడం, రసీదు ఇవ్వకపోవడం వంటి అంశాలు ఈ దోపిడీకి సాక్ష్యం.

– బి. సురేష్‌, అరసవిల్లి గ్రామం,శ్రీకాకుళంజిల్లా.

➡️