కోలీవుడ్‌ నటుడు శంకరన్‌ మృతి

Dec 14,2023 19:30 #movie

కోలీవుడ్‌కు చెందిన సీనియర్‌ నటుడు, దర్శకుడు రామరత్నం శంకరన్‌ (92) గురువారంనాడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు భారతీరాజా ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఆర్‌ఎ.శంకరన్‌ 1931 జూలైలో తమిళనాడులో జన్మించారు. సినిమారంగంపై ఉన్న ఆసక్తితో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తొలుత పలువురు దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ఎనిమిది చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్నాళ్లకు నటుడిగా మారారు. ‘పెరుమైక్కురియవల్‌'(1977) ఆయన నటించిన తొలి చిత్రం. ఎన్నో చిత్రాల్లో తండ్రిగా, ఇంటికి పెద్దగా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘మౌనరాగం’ చిత్రంతో రేవతికి తండ్రిగా నటించారు. నటుడిగా 50కిపైగా చిత్రాల్లో నటించారు. శంకరన్‌ మృతికి భారతీరాజా తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.

➡️